Nara Lokesh Talks About Kadapa Steel Factory: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విరుచుకుపడ్డాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీ మూడేళ్లలో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన రోజు ఇచ్చిన హామీ గుర్తుందా అంటూ ధ్వజమెత్తారు. 'జగన్ టెంకాయ కొట్టి నేటికి మూడేళ్లు అయ్యింది.. ఉక్కు ఫ్యాక్టరీ ఏదీ.. ఎక్కడ' అంటూ ఆయన నిలదీశారు. ఉక్కు సంకల్పంతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి.. 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని ఊరించి ఉసూరుమనిపించారని మండిపడ్డారు.
'కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఒక్కసారి జగన్ బటన్ నొక్కాలి' - ఏపీ రాజకీయ వార్తలు
Nara Lokesh About Kadapa Steel Factory: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విరుచుకుపడ్డాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీ మూడేళ్లలో పూర్తి చేస్తామని శంకుస్థాపన చేసిన రోజు ఇచ్చిన హామీ గుర్తుందా అంటూ.. ప్రశ్నించారు. కన్నతల్లిలాంటి కడపకు, రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ గడ్డకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం విజనరీ పాలనకు.. వైసీపీ ప్రభుత్వం ప్రిజనరీ పాలనకు ప్రతిరూపం అని లోకేశ్ ఎద్దేవా చేశారు.
కన్నతల్లిలాంటి కడప.. రాజకీయ జీవితం ఇచ్చిన రాయలసీమ గడ్డకు సీఎం తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేయడం చంద్రబాబు విజనరీ పాలన అయితే.. శంకుస్థాపన చేసి మరిచిపోవడం జగన్ రెడ్డి ప్రిజనరీ పాలన అంటూ దుయ్యబట్టారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, సాక్షి, భారతి సిమెంట్ కోసం బటన్ నొక్కి.. కోట్లు నొక్కేసే కోతల రెడ్డి, కడప ఉక్కుఫ్యాక్టరీ పూర్తి కావడానికి ఒక్కసారి బటన్ నొక్కాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కడప ఉక్కు పరిశ్రమపై జగన్ హామీల ప్రసంగాలు, ప్రకటనలకు సంబంధించిన వీడియోలను ట్వీటర్ వేదికగా లోకేశ్ విడుదల చేశారు.
ఇవీ చదవండి