తెలంగాణ

telangana

ETV Bharat / state

వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది: నారా లోకేశ్ - ఏపీ ముఖ్యవార్తలు

Yuvagalam padayatra : ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్​సీపీ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలు దోచేసి జైలుకు వెళ్లిన జగన్ పాదయాత్ర చేస్తే.. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని గుర్తు చేస్తూ.. తాను పాదయాత్ర చేస్తే ఇన్ని ఆంక్షలా..? అని ప్రశ్నించారు.

Yuvagalam padayatra
Yuvagalam padayatra

By

Published : Feb 13, 2023, 10:30 PM IST

వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది: నారా లోకేశ్

Yuvagalam padayatra : యువగళం పాదయాత్రతో వైఎస్సార్​సీపీ అంతిమ యాత్ర మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ అన్నారు. ఆయన చేస్తోన్న పాదయాత్ర 18వ రోజు ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రకు ముందు చినరాజకుప్పం విడిది కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన లోకేశ్‍.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనపై మండిపడ్డారు.

యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి వెయ్యిమంది పోలీసులను మోహరించారని.. జగన్ రెడ్డి మూడున్నరేళ్లలో తన మైకును తొలగించడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పదో తరగతి తప్పిన జగన్​కు ఇంత తెలివితేటలుంటే.. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన తనకెంత తెలివి ఉండాలన్నారు.

సంక్షేమంపై దృష్టి పెట్టాలి.. లక్ష కోట్ల రూపాయలు దోచేసి జైలుకు వెళ్లిన జగన్ పాదయాత్ర చేస్తే.. అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని గుర్తుచేస్తూ.. తాను పాదయాత్ర చేస్తే ఇన్ని ఆంక్షలా అని ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆడ్డుకోవడంపై చూపిన శ్రద్ధ.. పోలీసులు సంక్షేమంపై పెట్టాలని హితవు పలికారు. జగన్‍ పాలనలో కానిస్టేబుల్ కు రూ.75 వేలు, ఎస్ఐకి రూ.90వేలు, సీఐకి లక్ష రూపాయలు బకాయి పెట్టారని ఆరోపించారు. పోలీసులు, ఉపాధ్యాయ నియామకాలు లేకుండా జగన్‍ చేశారని ధ్వజమెత్తారు.

రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడోస్థానం.. బాబాయిని చంపిన కేసులో భారతిరెడ్డి పీఏను సీబీఐ విచారించిందని.. కేసుల నుంచి బయటపడటానికి ప్రత్యేక హోదాను అడగటం లేదన్నారు. కంత్రీ జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. టీడీపీ హయాంలో ఉద్యోగులకు పీఆర్సీతో పాటు జీతాలు సకాలంలో వచ్చాయని.. కంత్రీ జగన్ పాలనలో జీతాల కోసం దేవుడిని చూడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details