ఏపీలో పరీక్షల(Exams) నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమమని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆరోపించారు. పరీక్ష నిర్వహణ వల్ల 80 లక్షలమందికి ముప్పు పొంచి ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం 15 లక్షలమంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే తెదేపా పరీక్షలు రద్దు చేయాలని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.
పరీక్షలు(Exams) రద్దుచేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని లోకేశ్(Lokesh) అన్నారు. దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా జగన్ వైఖరి సరికాదని అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీంకు తెలపాలన్నారు.