తెలంగాణ

telangana

ETV Bharat / state

పాదయాత్రపై నారా లోకేశ్‌ అధికారిక ప్రకటన.. ఎప్పటినుంచంటే..? - announcement on lokesh padayatra

NARA LOKESH PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు లోకేశ్​ అధికారికంగా ప్రకటించారు.

పాదయాత్రపై నారా లోకేశ్‌ అధికారిక ప్రకటన.. ఎప్పటినుంచంటే..?
పాదయాత్రపై నారా లోకేశ్‌ అధికారిక ప్రకటన.. ఎప్పటినుంచంటే..?

By

Published : Nov 25, 2022, 2:04 PM IST

NARA LOKESH PADAYATRA : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్రపై అధికారిక ప్రకటన వెలువడింది. 2023 జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు లోకేశ్​ అధికారికంగా ప్రకటించారు. మంగళగిరిని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. తనని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వాడే అన్ని ఆయుధాలను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని మంగళగిరిలో కార్యకర్తలకు స్పష్టం చేశారు. మంగళగిరిలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని.. మిగిలిన రోజులు రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details