తెలంగాణ

telangana

ETV Bharat / state

టీడీపీ జన సునామీని దమ్ముంటే తట్టుకో జగన్​.. నారా లోకేశ్ సవాల్ - ఏపీ రాజకీయ వార్తలు

Lokesh Responded On GO No 1: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్1 పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అక్రమ‌ అరెస్టుల‌తో టీడీపీని భ‌య‌పెట్టాల‌ని చూశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస‌ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు రాయ‌ల‌సీమ స‌మ‌ర‌శంఖం పూరించిందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జ‌న‌సునామీని ద‌మ్ముంటే త‌ట్టుకో జగన్ అంటూ సవాల్ విసిరారు.

Lokesh Responded On GO No 1
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

By

Published : Jan 3, 2023, 7:22 PM IST

Lokesh Fire on Restrictions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ టీడీపీ జ‌న‌ సునామీని ద‌మ్ముంటే త‌ట్టుకో జగన్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని.. ఇంటి మీదే దాడి చేసినా ఆయ‌న‌ని ఆప‌లేక‌పోయావని ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీకి కార్యర్తలను దూరం చేయాల‌ని కేంద్ర కార్యాల‌యాన్ని ధ్వంసం చేయించారని మండిపడ్డారు. అక్రమ‌ అరెస్టుల‌తో టీడీపీని భ‌య‌పెట్టాల‌ని చూశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస‌ పాల‌న‌కి చ‌ర‌మ‌గీతం పాడేందుకు రాయ‌ల‌సీమ స‌మ‌ర‌శంఖం పూరించిందని స్పష్టం చేశారు.

కోస్తా వైసీపీ స‌ర్కారుకు కొరివి పెట్టనుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స‌భ‌లు అడ్డుకోవాల‌నే కుతంత్రమే కందుకూరు, గుంటూరు ఘ‌ట‌న‌ల‌ని మీరు తెచ్చిన చీక‌టి జీవోనే చెబుతోందని ఆరోపించారు. అణ‌చివేత అధిక‌మైతే తిరుగుబాటు తీవ్రం అవుతుంద‌నే చారిత్రక స‌త్యమని తెల్చిచెప్పారు. తెలుగుదేశం తెగువ చూసి వ‌ణికిపోతున్నారని దుయ్యబట్టారు.

వైసీపీపై తీవ్రమైన ప్రజా వ్యతిరేక‌త‌, తెలుగుదేశం పార్టీకి వెల్లువెత్తుతున్న ప్రజాద‌ర‌ణ‌ని చూసి ఓర్వలేక‌పోయావని ఆక్షేపించారు. స‌భ‌ల‌కు వెళ్తే ప‌థ‌కాలు ర‌ద్దు చేస్తామ‌ని బెదిరిస్తే.. మూల‌నున్న ముస‌ల‌మ్మ కూడా బెద‌ర‌డం లేదని వెల్లడించారు. అలాగే విధుల‌కు 10 నిమిషాలు ఆల‌స్యమైతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు జీతం కోత అని హెచ్చరించిన సీఎంకు.. ప‌ది రోజులైనా జీతాలు ఇవ్వలేని మీకు ఏం కోత వేయాలో చెప్పాలి అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details