ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ ధరించి మనిషినని నిరూపించుకుంటారా లేక మాస్క్ పెట్టుకోకుండా మూర్ఖుడిగానే ఉంటారా..? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మాస్క్ పెట్టుకోకుండా ముఖ్యమంత్రి ప్రజలకేం సంకేతాలిస్తున్నారని ట్విటర్లో నిలదీశారు. మాస్క్ ధరించటం తప్పనిసరని తన ఫొటో, పేరుతో కోట్లాది రూపాయలు ప్రకటనలిస్తున్న ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారని ప్రశ్నించారు.
తొలి విడతలో కొవిడ్ వైరస్ను తేలిగ్గా తీసుకుని వేలాదిమందిని బలిచ్చారని మండిపడ్డ లోకేశ్... రెండో దశలో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరునవ్వులు చిందిస్తూ, మాస్క్ ధరించకుండా ఇంకెంత మంది ప్రాణాలు పణంగా పెడతారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి మాస్క్ లేకుండా అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఫొటోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.