దాడులు చేసినంత మాత్రాన తాము భయపడమని.. ప్రభుత్వంపై చేసే తప్పులపై పోరాడుతున్నామన్నారు నారా లోకేశ్(nara lokesh fires on cm jagan news). ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలుంటున్నాయని ఆరోపించారు. ఏపీ నుంచి గంజాయి ఎక్కువగా వస్తోందని హైదరాబాద్ సీపీ చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు. గంజాయి నివారణలో తెలంగాణకు ఉన్న చిత్తశుద్ధి ఏపీకి లేదన్నారు.
'4 అద్దాలు పగిలితే భయపడతామని భావిస్తున్నారా..? రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి. దుండగుల కార్లు డీజీపీ కార్యాలయం మీదుగానే వచ్చాయి. మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారు. తెదేపా కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు రాకూడదా? తెదేపా కార్యకర్తలు వస్తున్న అంబులెన్స్‌ను కూడా ఆపారు' - నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
నడివీధిలో చంద్రబాబును కాల్చాలని జగన్ అన్నారా.. లేదా..? అని లోకేశ్ నిలదీశారు. చంద్రబాబును ఏమైనా అంటే ఏపీకే బీపీ వస్తుందన్నారు. వైకాపా నేతలు పోలీసులను అనేక తిట్లు తిట్టారని.. కానీ వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. బూతులకు కేరాఫ్ అడ్రస్.. వైకాపా యూనివర్సిటీ అంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు.