మంచుకొండల్లో నారా బ్రాహ్మణి అడ్వెంచర్.. వీడియో వైరల్ - NARA BRAHMAN LATEST NEWS
Nara Bramhani Bike ride in Ladakh : ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీకి సంబంధించిన వారసులు వస్తున్నారంటే రాజకీయాలు లేక సినిమాల్లో నటించటం అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం తండ్రి రాజసం, డేరింగ్, సాహసాలను పునికి పుచ్చుకున్నారు నందమూరి నటసింహం పెద్దకూతురు నారా బ్రాహ్మణి. తాజాగా హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ యాత్ర చేశారు. అక్కడి పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై ఆమె దూసుకెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు సభ్యులుగా ఉన్న యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ వైపీఓ ఇటీవల ద లడక్ క్వెస్ట్ పేరుతో నిర్వహించిన సాహస యాత్రలో బ్రాహ్మణి పాల్గొని.. పసుపు రంగు బైక్ నడిపారు. ఈ యాత్రకు సంబంధించి జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ పేరుతో ఓ లఘుచిత్రాన్ని వైపీఓ రెండు వారాల క్రితం రూపొందించింది. లద్దాఖ్ నుంచి తన యాత్ర అద్భుతంగా సాగిందని బ్రాహ్మణి అందులో పేర్కొన్నారు.
Nara Bramhani Bike ride in Ladakh