Nandini Agasara got Bronze Medal in asian games 2023 :తెలంగాణ గురుకుల విద్యార్థిని నందిని అగసర.. ఆసియా క్రీడాల్లో(Asian Games2023)కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందిని.. హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. నందిని సంగారెడ్డిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో బీబీఏ రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్నారు.
Asian Games 2023 : అతి పెద్ద క్రీడా సంబరానికి వేళాయే.. నీరజ్‌తో పాటు ఈ అథ్లెట్లపైనే ఆశలు
Gurukula Student Bronze Medal in asian games 2023 :నార్సింగిలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నారు. నందిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని కావడం విశేషం. తండ్రి ఎల్లయ్య చాయ్ అమ్ముతూ తన కూతురు నందినిని గురుకుల పాఠశాలలో చేర్పించారు. నందిని విద్యలో రాణిస్తూనే.. క్రీడారంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆసియా క్రీడలకు ఎంపిక అయినట్లు నందిని కుటుంబసభ్యులు తెలిపారు.
నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉన్నారు. గురుకుల విద్యార్థిని నందిని ఆసియా క్రీడాల్లో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర సంక్షేమశాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్, గురుకుల విద్యా సంస్థల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.