Nandamuri Taraka Ratna Entry in Politics: రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తానని, టీడీపీకు అండగా నిలుస్తానని సినీ హీరో నందమూరి తారకరత్న చెప్పారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మామయ్యకు అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ప్రజలకు మంచి చేసే ఆశయంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని, ఆయన వెన్నంటే ఉంటామని తెలిపారు..
"ఏ రోజు కూడా నందమూరి కుటుంబం పదవులు ఆశించలేదు. కేవలం ప్రజల కోసం పోరాడాతాం. ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. చంద్రబాబు మామయ్యను నేను నమ్ముతున్నాం. ఆయనకు ఎప్పుడూ అండగానే ఉంటాం. టైం వచ్చినప్పడు తమ్ముడు కూడా వస్తాడు. ఎప్పుడూ చెప్పలేం కానీ తప్పకుండా వస్తాడు." - హీరో నందమూరి తారకరత్న