Nandamuri Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేస్తే తెలుగుజాతిని అవమానించినట్లేనని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగుజాతి ఊరుకోదని హెచ్చరించారు. ఎన్టీఆర్ అభిమానులమని చెప్పే కొందరు వైకాపా నాయకులు నిద్రపోతున్నారా? అని నందమూరి రామకృష్ణ నిలదీశారు.
ఇదీ జరిగింది..
ఏపీలోని గుంటూరు జిల్లా దుర్గిలో ఓ వ్యక్తి.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. దుర్గి మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు.. గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో విగ్రహం స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్.. కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఇదీ చదవండి:NTR STATUE IN DURGI : అందరూ చూస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి!