విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి కుటుంబం నివాళులు అర్పించింది.
'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు' - నందమూరి కుటుంబం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.
'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఉంటారు'
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి స్వర్గీయ ఎన్టీఆర్కు నివాళి అర్పించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు రామారావు ఉంటారని, ఆయన భౌతికంగా లేకపోయినా ప్రతి తెలుగు వాడి గుండెల్లో జీవించే ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
తమ అభిమాన నటుడు, రాజకీయవేత్తను గుర్తు చేసుకుని పెద్ద సంఖ్యలో నందమూరి అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.