హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్న 30 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు నాంపల్లి రైల్వే పోలీసులు. వారి జీతాల నుంచి కొంత నగదును సమకూర్చి ఈ కార్యక్రమం చేపట్టినట్లు రైల్వే ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - హైదరబాద్ ఆటో డ్రైవర్లను ఆదుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు
లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆటో వాలాలకు నాంపల్లి రైల్వే పోలీసులు చేయూత అందించారు. మేడే ను పురస్కరించుకుని 30 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపణీ చేశారు.

ఆర్పీఎఫ్ పోలీస్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
సాధారణ రోజుల్లో స్టేషన్ సమీపంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధిలేక కుటుంబం గడపడమే భారంగా మారిన ఆటో వాలాలకు సాయం చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఇదీ చూడండి:కదలనిమగ్గం... నిండని కడుపులు