తెలంగాణ

telangana

ETV Bharat / state

రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన నాంపల్లి కోర్టు - టీవీ9 రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్

రవిప్రకాశ్​ను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్​ పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన నాంపల్లి కోర్టు

By

Published : Oct 15, 2019, 4:25 PM IST

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్​ను పదిరోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్​ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఏబీసీఎల్​ సంస్థ నిధులను మళ్లించారన్న ఆరోపణలపై అరెస్టయిన రవిప్రకాశ్​ను పదిరోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే అన్ని విషయాలు వివరించారని రవిప్రకాశ్​ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్​ను తిరస్కరించింది. రవిప్రకాశ్​కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​ తిరస్కరించిన నాంపల్లి కోర్టు

ABOUT THE AUTHOR

...view details