తెలంగాణ

telangana

ETV Bharat / state

రామచంద్రభారతికి బెయిల్.. నందకుమార్‌కు 14 రోజుల రిమాండ్ - రామచంద్రభారతి నందకుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు

ఎమ్మెల్యేల ఎర కేసు నిందితులైన రామచంద్రభారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల నగదు చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. అలాగే నందకుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నందకుమార్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

TRS mlas buying case
TRS mlas buying case

By

Published : Dec 8, 2022, 9:07 PM IST

TRS mlas buying case ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులైనా రామచంద్ర భారతి, నంద కుమార్‌ల ఇతర కేసుల్లో నాంపల్లి కోర్టు వాదనలు కొనసాగాయి. రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బోగస్ ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామ చంద్ర భారతి, దోమ మండలంలో సతీశ్ అనే వ్యక్తి భూమి వ్యవహారంలో బెదిరింపులు చేశారని ఫిర్యాదు మేరకు నందకుమార్ మీద ఐపీసీ 386, 387 సెక్షన్ల కింద నమోదైన కేసులో అరెస్ట్ చేశారు.

Ramachandra And Nandakumar బంజారాహిల్స్ కేసులో రామచంద్ర భారతి బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు... 10 వేల నగదు, రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశింది. మరో కేసులో నంద కుమార్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రీమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించడంతో నంద కుమార్‌ను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. నిన్న వీరద్దరికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయమే విడుదల కాగా పోలీసులు వారిని ఇతర కేసుల్లో అరెస్టు చేశారు.

కారాగారం నుంచి తమ వస్తువులతో ఇద్దరూ బయటికి రాగా... అప్పటికే గేటు వద్ద పోలీసులు కాపు కాశారు. నిందితులిద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు. ఇక ఇదే కేసులో సిట్ మెమో కొట్టివేత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. దీనిపై కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details