తెలంగాణ

telangana

ETV Bharat / state

'నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం' - హైదరాబాద్​ తాజా వార్తలు

భవిష్యత్​ అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని నాంపల్లి నియోజకవర్గ తెరాస కార్యకర్తలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.

'నూతన రెవన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం'
'నూతన రెవన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం'

By

Published : Sep 12, 2020, 5:04 PM IST

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోను అభివృద్ధి చేసేందుకు తెరాస సర్కారు ప్రయత్నిస్తోందని నాంపల్లి నియోజకవర్గ తెరాస నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

గుడిమల్కాపూర్ గోల్డెన్ ప్యాలెస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేసి... మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో తెరాస గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గంగపుత్ర, అరుణ్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details