ఎన్నికల నియామావళి ఉల్లంఘన కేసులో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు.. కోర్టులో ఊరట లభించింది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఉపసంహరించాలని కోరడంతో.. న్యాయస్థానం అంగీకరించింది. రూ.10వేల పూచీకత్తును సమర్పించాలని ఆమెను ఆదేశించింది.
ఆ కేసులో ఎమ్మెల్యే సీతక్కకు ఊరట - ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వేర్వేరు కేసులకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు ఊరట లభించగా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఎమ్మెల్యే సీతక్కకు ఊరట
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును.. కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌పై ఎన్బీడబ్ల్యూ అమలు చేయకపోవడాన్ని తప్పుపడుతూ.. నిజామాబాద్ గ్రామీణ పోలీస్‌స్టేషన్ సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:స్థలం కబ్జా అయిందని 70 ఏళ్ల బామ్మ ఆందోళన