హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. పట్టపగలే దుండగులు న్యాయవాదులపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చిన ఘటనకు నిరసనగా... న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
నాంపల్లి కోర్టులో న్యాయవాదుల ఆందోళన - న్యాయం కోసం న్యాయవాదుల పోరాటం
వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ర్యాలీలు నిర్వహించారు. నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో విధులు బహిష్కరించిన లాయర్లు... రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు.
న్యాయవాదుల హత్యకు నిరసనగా నాంపల్లి కోర్టులో లాయర్ల ఆందోళన
నాంపల్లి సిటీ సివిల్ కోర్టు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీగా వెళ్తున్న అడ్వకేట్లను సైఫాబాద్ పీఎస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో న్యాయవాదులను బలవంతంగా అరెస్ట్ చేశారు. జంట హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?