సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో దేశంలో నెలకొన్న సమస్యలపై చర్చకు సమయం ఇవ్వాలని కోరినట్లు తెరాస లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావు (NAMA NAGESWARA RAO) వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపైనా గళమెత్తుతామని స్పష్టం చేశారు. ఆ చట్టంలో పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. దీనిపై కేంద్రానికి ఇప్పటికే అనేక లేఖలు ఇచ్చామని వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
పెట్రోల్(petrol costs), డీజిల్ ధరలు(diesel costs) తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరామని నామ తెలిపారు. రాష్ట్ర హక్కులు, రావాల్సిన నిధుల గురించి సభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.