రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామని తెరాస లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. మా పోరాటానికి కాంగ్రెస్, భాజపా ఎంపీలు కలిసి వస్తారో... రారో తేల్చుకోవాలని సూచించారు.
ఏడేళ్లుగా పలు సమస్యలపై కేంద్రానికి లేఖలు రాసి సీఎం కేసీఆర్ అలసిపోయారని తెలిపారు. నూతన విద్యుత్ చట్టంతో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధానాన్ని భాజపా ఎంపీలు సమర్ధిస్తారా అని ప్రశ్నించారు.