తెలంగాణ

telangana

ETV Bharat / state

'వివాద పరిష్కార కేంద్రం ఏర్పాటుకు సీజేఐ సహాయసహకారాలు' - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్​ లక్డీకపూల్​లోని ఫెడరేషన్ హౌస్​లో నల్సార్- ఎఫ్టీసీసీఐ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం ఏర్పాటుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహాయసహకారాలు అందించనున్నారు. ఈ మేరకు రాజ్​భవన్​లో సీజేఐని కలిసిన ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనానీ తెలిపారు.

Nalsar FTCCI team Members met CJI Justice NV Ramana
సీజేఐ జస్టీస్​ ఎన్వీ రమణను కలిసిన నల్సార్​ ఎఫ్​టీసీసీఐ బృందం సభ్యులు

By

Published : Jun 18, 2021, 9:01 AM IST

హైదరాబాద్​ లక్డీకపూల్​లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం ఏర్పాటుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహాయసహకారాలు అందించనున్నారని... ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్ ఇనానీ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలోని ఫెడరేషన్​ బృందం రాజ్​భవన్​లో సీజేఐని కలిసినట్లు పేర్కొన్నారు.

ఈ ఏడీఆర్ కేంద్రంలో మధ్యవర్తిత్వంతో పాటు నైపుణ్య శిక్షణ కూడా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. సింగపూర్, లండన్, యూఏఈ స్థాయిలో కేంద్రం ఏర్పాటు కావాల్సి ఉందని సీజేఐ అభిప్రాయపడ్డారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 42 కు పెంచటం పట్ల సీజేఐకి ఫెడరేషన్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: 'మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు'

ABOUT THE AUTHOR

...view details