తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​​ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు' - నల్లు ఇంద్రసేనా రెడ్డి

సీఎం కేసీఆర్​ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. కాబ్​పై కాంగ్రెస్, తెరాసలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

nallu indrasenareddy fair on trs in Hyderabad
'కేసీఆర్​ యూనియన్​ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు'

By

Published : Dec 21, 2019, 9:44 AM IST

సీఎం కేసీఆర్​ రాష్ట్రంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీలు, జీహెచ్ఎంసీ, అంగన్​వాడీ, ఆర్టీసీలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. యూనియన్లను రద్దు చేయాలనుకోవటం వ్యవస్థలను నిర్వీర్యం చేయాలనుకోవటంలో భాగమేనన్నారు.

సీఎంతో కాకుండా.. కేంద్రం కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడతామంటే కుదురుతోందా అని ప్రశ్నించారు. కార్మికుల సంక్షేమం కోసం.. బ్రిటిష్ కాలంలోనే యూనియన్లు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. కార్మికులపై కేసీఆర్ వ్యతిరేక ధోరణిని ఖండిస్తున్నామన్నారు.
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ పత్రికా ముఖంగా చెప్పగలరా అని నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. కాబ్​పై కాంగ్రెస్, తెరాసలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కొన్ని పాఠశాలలు సీఏఏకు వ్యతిరేకంగా విద్యార్థులకు నూరిపోస్తోన్న విషయం మా దృష్టికి వచ్చిందని... అలాంటి పాఠశాలలపై దేశ ద్రోహం కేసులు పెడతామని నల్లు హెచ్చరించారు.

'సీఎం కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు'

ఇవీ చూడండి: 'తెలంగాణ నూటికి నూరు శాతం లౌకిక రాష్ట్రం'

ABOUT THE AUTHOR

...view details