హైదరాబాద్ ముషీరాబాద్‌లోని విద్యానగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవ వద్ద మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించారు. సభలకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై నాయినికి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నాయిని నర్సింహా రెడ్డి సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ - నాయని నర్సింహా రెడ్డి సంస్మరణ సభ
కార్మికవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చేసిన సేవలు మరువలేమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్‌లోని విద్యానగర్ చౌరస్తా, రాంనగర్ ఈ సేవ వద్ద జరిగిన నాయని నర్సింహా రెడ్డి సంస్మరణ సభల్లో పాల్గొన్నారు.
నాయిని నర్సింహా రెడ్డి సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
నాయిని నర్సింహారెడ్డి కార్మిక నేతగా వేలాది మంది కార్మికులకు మార్గదర్శిగా నిలిచాడని అన్నారు. కార్మికవర్గం, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డి పాల్గొన్నారు.