రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలియజేశారు. నాయిని కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ఆమె ఓ సోదరిలా ఆప్యాయంగా పలకరించేవారని అన్నారు.
నాయిని సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపం - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ,
తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నాయిని సతీమణి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ఐదు రోజుల వ్యవధిలోనే భార్యభర్తలు చనిపోవడం చాలా దురదృష్టకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆమె మృతి పట్ల వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.