సాగర్‌కు కొనసాగుతోన్న ప్రవాహం.. దిగువకు నీటి విడుదల నాగార్జునసాగర్ జలాశయంకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 4 క్రస్ట్ గేట్ల(nagarjunasagar dam gates)ను ఐదు అడుగుల మేర ఎత్తి 32 వేల 360 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 24 వేల 238 క్యూసెక్కులు... కుడి, ఎడమ కాలువలకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచడం, తగ్గించడం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
జలాశయం వివరాలిలా..
సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.90 అడుగులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.74 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో మరొకసారి ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు.
సాగర్‌కు కొనసాగుతోన్న ప్రవాహం.. దిగువకు నీటి విడుదల శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద
శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద కొనసాగుతుంది. జలాశయం 20 గేట్లు ఎత్తి అధికారులు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,53,324 క్యూసెక్కులు ఉండగా... ఔట్‌ఫ్లో 1,53,324 క్యూసెక్కులుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం గరిష్ఠ నీటినిల్వ 20 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 19.425 టీఎంసీలుగా నమోదు అయింది.
వర్షాలతో జలాశయాలకు జలకళ
ఎడతెరిపిలేకుండా కురిసిన వానలతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ(Telangana Irrigation projects) నీటితో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో నీరు గరిష్ఠ మట్టానికి చేరువ కావడం వల్ల అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు.. భారీ వరదల వల్ల లోతట్టు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి: