తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నోముల భగత్ - తెరాస ఎమ్మెల్యే నోముల భగత్

ఇటీవలే సాగర్ ఉపఎన్నికలో విజయం సాధించిన తెరాస ఎమ్మెల్యే నోముల భగత్ పశుసంవర్ధక శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్​ వెస్ట్​మారేడ్​పల్లిలోని ఆయన నివాసంలో తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Nagarjunasagar MLA nomula bhagath meet minister talasani
మంత్రిని కలిసిన సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్

By

Published : May 5, 2021, 3:45 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గెలుపొందిన తెరాస ఎమ్మెల్యే నోముల భగత్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​కు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్​ వెస్ట్​మారేడ్​పల్లిలోని నివాసంలో మంత్రిని కలిశారు. శాలువాతో సత్కరించి మొక్కను ఆయనకు అందజేశారు.

రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నాగార్జునసాగర్​ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికలలో తనకు సహకరించిన వారందరికీ భగత్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:భవిష్యత్‌ కార్యచరణపై సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటా :ఈటల

ABOUT THE AUTHOR

...view details