Nagarjuna Sagar Water Issue in Andhra Pradesh and Telangana : నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది. గత అక్టోబర్‌లో ఏపీకి అనుమతించిన 45 టీఎంసీల కోటా నుంచే ఐదు టీఎంసీలను ఇస్తున్నట్లు తెలిపింది. రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లను సంప్రదించిన తర్వాత కేఆర్ఎంబీ నీటి విడుదల(KRMB Water Released) ఉత్తర్వులు జారీ చేసింది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 12వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరగనుంది.
నాగార్జునసాగర్ నిర్వహణ ఎవరిది? - తెలంగాణ, ఏపీల మధ్య తేలని పంచాయితీ
Krishna River Management Board Meeting : కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.45.63 కోట్ల నిధులు వచ్చాయి. ఇప్పటి వరకు రూ.45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ ఇచ్చిన మొత్తం రూ.24.91 కోట్లు, తెలంగాణ ఇచ్చిన మొత్తం రూ.19.71 కోట్లు. కేంద్రం ఇచ్చిన కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా ఇందులో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ రూ.13.61 కోట్లు, ఏపీ రూ.11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం రూ.3.35 కోట్లు ఇచ్చింది.