తెలంగాణ

telangana

ETV Bharat / state

MLA ROJA: మొన్న కబడ్డీ.. ఈరోజు వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా - ఏపీ 2021 వార్తలు

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో ఎమ్మెల్యే రోజా తన సోదరుడితో కలిసి పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన ఆమె.. సరదాగా వాలీబాల్ ఆడారు.

NAGARI MLA ROJA STARTED VOLLEYBALL COMPETTITIONS
వాలీబాల్ కోర్ట్​లో ఎమ్మెల్యే రోజా

By

Published : Nov 5, 2021, 2:02 PM IST

NAGARI MLA ROJA STARTED VOLLEYBALL COMPETITIONS

ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లాలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో నగరి శాసనసభ్యురాలు ఆర్.కె. రోజా తన సోదరుడు రాం ప్రసాద్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పుత్తూరు ఎస్.ఆర్.ఎస్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా.. తన సోదరుడు రాం ప్రసాద్ రెడ్డితో కలిసి వాలీబాల్ ఆడి సందడి చేశారు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.

వాలీబాల్ కోర్ట్​లో ఎమ్మెల్యే రోజా

మొన్న నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ క్రీడా పోటీలను ప్రారంభించిన ఆర్కే రోజా... భర్త సెల్వమణి కబడ్డీ ఆడి, క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులు చదువుకు, క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని రోజా అన్నారు.

వాలీబాల్​తో రోజా

ఇదీ చూడండి: MLA ROJA: భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

ABOUT THE AUTHOR

...view details