తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో దొంగలు పడ్డారు... - hyderabad

సంపన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడే ఓ దొంగల ముఠా నగరంలో ప్రవేశించింది. ఇందులోని కొందరి సభ్యులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అప్రమత్తమై అన్ని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

dongalu

By

Published : Sep 11, 2019, 2:25 PM IST

భాగ్యనగరంలో దొంగలు పడ్డారు...

భాగ్యనగరంలో సంపన్నులు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడే ఓ నేపాలీ దొంగల ముఠా భాగ్యనగరంలోకి ప్రవేశించింది. నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లో పనికి చేరి దోపిడీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముఠా 20 రోజుల క్రితం నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అబిడ్స్‌ ప్రాంతంలో దొంగతనాల్లో ఈముఠా పాల్గొన్నట్లు గుర్తించారు. ముఠాలోని మహిళా సభ్యురాలు వంట మనిషిగా, మిగిలిన వారు కాపలాదారులుగా ఇళ్లలో చేరడానికి ఇక్కడికి వచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. అలాగే ముఠాలోని సభ్యుల చిత్రాలను అందించారు. పనివాళ్ల విషయంలో హాక్‌ఐను ఉపయోగించుకొని వారి వివరాలను అందులో పొందుపర్చాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫొటోల్లో ఉన్నవారిని గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details