Nagam Janardhan Reddy Joined BRS :రాష్ట్ర ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరిరువురిని తెలంగాణ భవన్లో కేసీఆర్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడారు.
Vishnu Vardhan Reddy Joined in BRS Today : 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో నాగం జనార్ధన్ రెడ్డి జైలుకు వెళ్లారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆనాడు నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్‌రెడ్డిని తానే పార్టీలోకి ఆహ్వానించానని పేర్కొన్నారు. పీజీఆర్ తనకు వ్యక్తిగత మిత్రుడని.. విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు తన బాధ్యత అని మాట ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. తాను, నాగం జనార్ధన్‌రెడ్డి కలిసి పని చేశామని.. ఎన్నో పోరాటాలు చేశామని చెప్పారు. నాగం సలహాలు, సూచనలు తీసుకొని 14 నియోజకవర్గాలు గెలవాలని అభ్యర్థులకు సూచించారు. మాగంట గోపీనాథ్, విష్ణువర్ధన్ రెడ్డి కలిసి సమన్యయంతో పని చేయాలన్నారు.