రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్మించేదేనని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రీ డిజైనింగ్, రీ ఇంజినీరింగ్ ప్రాజెక్టులంటూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 106 టీఎంసీల నీరు ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చిందన్నారు. ఆ ఆయకట్టును చూపించి మొత్తం నీళ్లన్నీ తానే ఇచ్చానని సీఎం ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
'స్పష్టమైన ప్రకటన రాకపోతే జాన్ 2 నుంచి ఉద్యమిస్తాం' - పోతిరెడ్డిపాడుపై స్పష్టమైన ప్రకటన లేకుంటే
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం నుంచి కేవలం 53 టీఎంసీల నీరు ఎత్తిపోసి 303 టీఎంసీల నీరు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాకపోతే జూన్ 2 నుంచి ఉద్యమిస్తామన్నారు.
'స్పష్టమైన ప్రకటన రాకపోతే జాన్ 2 నుంచి ఉద్యమిస్తాం'
ప్రభుత్వం చేసే అక్రమాలను అడ్డుకుంటారని ప్రతిపక్షాలు లేకుండా నిర్వీర్యం చేశారని చెప్పారు. పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాకపోతే జూన్ 2 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుందన్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రం నుంచి ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు...