తెలంగాణ

telangana

ETV Bharat / state

Nagababu Reacts on Niharika: 'నిహారిక క్లియర్.. తప్పుడు ప్రచారం చేయొద్దు' - Nagababu video relesed

Nagababu Reacts on Niharika: రాడిసన్ బ్లూ హోటల్ పబ్ డ్రగ్స్ కేసు ఘటనపై సినీనటుడు నాగబాబు స్పందించారు. ఈ విషయంలో తన కుమార్తె క్లియర్ అని చెప్పిన నాగబాబు... ఆమె తప్పులేదని పోలీసులే చెప్పారని వివరించారు.

Nagababu
Nagababu

By

Published : Apr 3, 2022, 3:50 PM IST

Updated : Apr 3, 2022, 3:58 PM IST

'నిహారిక క్లియర్.. తప్పుడు ప్రచారం చేయొద్దు'

Nagababu Reacts on Niharika: రాడిసన్ బ్లూ హోటల్ పబ్ డ్రగ్స్ కేసులో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని మెగాబ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు. రాత్రి తన కుమార్తె అక్కడ ఉన్న మాట వాస్తమేనని పేర్కొన్న నాగబాబు... పరిమిత సమయానికి మించి పబ్ కొనసాగడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ విషయంలో నిహారికకు ఎలాంటి తప్పు లేదని పోలీసులు తెలిపారని వెల్లడించారు. ఈ కేసుపై సామాజిక మాద్యమాలు, మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన నాగబాబు... అసత్య ప్రచారం వద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్​ ఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటం. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పోలీసులు పబ్​పై యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీ ఈజ్ క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాంటి అసత్యప్రచారం చేయకూడదనే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా.

Last Updated : Apr 3, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details