Nagababu Interesting Comments: జనసేన నాయకుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అసలు పార్టీనే కాదని.. దౌర్జన్యాలు, అరాచకాలకు చిరునామా అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది.. అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. పవన్‌పై పోటీ చేస్తానన్న అలీ వ్యాఖ్యలపై స్పందించడం దండగని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన వీర మహిళల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది? ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ చెబుతారనిన నాగబాబు తెలిపారు. పొత్తులపై ఇప్పటి వరకూ సమాచారం లేదని చెప్పారు. అందుకే దాని గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు రాయలసీమ జిల్లాల్లో పార్టీ బలంగా ఉందని.. దానిని సద్వినియోగం చేసుకోవాలని నాగబాబు స్పష్టం చేశారు.