తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి నిరంజన్​రెడ్డి విజ్ఞప్తిపై నాబార్డ్ సానుకూల స్పందన - Minister Niranjan Reddy Visit

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేయూత ఇవ్వాలని మంత్రి నాబార్డ్ ఛైర్మన్​ను మంత్రి నిరంజన్​రెడ్డి కోరారు. మంత్రి విజ్ఞప్తిపై నాబార్డ్ సానుకూల స్పందించింది.

NABARD responds positively to Minister Niranjan Reddy's appeal
మంత్రి నిరంజన్​రెడ్డి విజ్ఞప్తిపై నాబార్డ్ సానుకూల స్పందన

By

Published : Nov 3, 2020, 7:57 PM IST

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేయూత ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అన్నారు. నాలుగు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబయిలో నాబార్డ్​ ఛైర్మన్​ డాక్టర్​ చింతల గోవిందరాజులును మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం... సాగు నీటి పారుదల ప్రాజెక్టులు, సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతు బీమా పథకాలు వంటి వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తున్న దృష్ట్యా... నాబార్డ్ నుంచి ఇతోధికంగా సాయం అందించాలని మంత్రి కోరారు. కీలక వ్యవసాయ రంగం, రైతు రంగానికి విశాల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని నాబార్డ్ పథకాల ద్వారా రీఫైనాన్స్ సదుపాయాలు కల్పించాలన్న విజ్ఞప్తిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details