Kulsumpura Boy Death Case: హైదరాబాద్‌లో 12 ఏళ్ల బాలుడి మృతి కేసులో మిస్టరీ వీడింది. 12ఏళ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. 15 వీధి కుక్కలు ఒకేసారి దాడిచేసి... బాలుడి మెడ, తల, వీపు భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిని ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ బృందం ధ్రువీకరించింది. ఈ నెల 19న కుల్సుంపురాలో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మెడ, తలపై తీవ్రగాయాలతో మూసీ ఒడ్డున మృతదేహం లభ్యమైంది.
అబ్బాయి మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఎవరో కత్తులతో పొడిచి చంపారని మొదట అనుమానించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించి భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో కుక్కలదాడిలోనే బాలుడు ప్రాణాలొదిలినట్లు తేలింది. ఏప్రిల్ 27న గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతిచెందాడు. కుక్కల స్వైరవిహారం చేస్తూ దాడులు చేస్తూ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇవీ చూడండి: