వింత మూర్చ వ్యాధి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 583కి చేరింది. ఆసుపత్రిలో 93 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 470 మందిని డిశ్చార్జి చేశారు.
ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య - ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి
ఏపీ ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బాధితుల సంఖ్య 583కి చేరింది. ఇప్పటికే 470 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో 93 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సీడీసీ అధికారులు.. ఆస్పత్రిని సందర్శించి నమూనాలు సేకరించారు.
ఏలూరులో 583కు చేరిన వింత వ్యాధి బాధితుల సంఖ్య
డబ్ల్యూహెచ్‌వో, ఎన్‌సీడీసీ అధికారులు.. ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ మోహన్‌తో అధికారులు భేటీ అయ్యారు. రోగుల వివరాలు, ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల పర్యటన