Mylavaram Agricultural Market In drink party: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు సిబ్బంది మరో ఇద్దరితో కలిసి మందు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని సిబ్బంది ఆఫీస్ గదిలో యార్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న పీర్ సాహెబ్, నాగరాజులు కనుమ రోజున మందు తాగుతూ విధులు నిర్వర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఉన్న దృశ్యాల ప్రకారం.. ఆఫీసు గదిలోని టేబుల్‌పై మార్కెట్‌కు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ మధ్యలోనే మందు కలిపిన మూడు మందు గ్లాసులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గ్లాసుల కొద్దీ దూరంలోనే మందు సీసా కూడా ఉంది. టేబుల్ ఇరువైపులా సిబ్బంది కూర్చోగా, మరొకరు చరవాణిలో దృశ్యాలను చిత్రీకరించారు. ఆ తర్వాత ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు మందు పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.