తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు(chandrababu news) చేస్తున్న 36 గంటల దీక్షపై ఏపీ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి కాబట్టి పార్టీ కార్యాలయంపై రాళ్లు వేశారని, అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవని హెచ్చరించారు. వైకాపా చేపట్టిన 48 గంటల దీక్షలో భాగంగా మైదుకూరులో చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే గాక రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చి.. అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు.
ఇప్పుడేం జరిగిందని రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు