జీహెచ్ఎంసీలో తన విజయానికి కృషి చేసిన ఖైరతాబాద్ 91వ డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటానని తెరాస అభ్యర్థి విజయారెడ్డి అన్నారు. ఈ గెలుపును డివిజన్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
నా విజయం ప్రజలకు అంకితమిస్తున్నా : విజయారెడ్డి - గ్రేటర్ ఎన్నికల తాజా ఫలితాలు 2020
గ్రేటర్ ఎన్నికల్లో తన విజయాన్ని ప్రజలకు అంకితమిస్తున్నానని ఖైరతాబాద్ 91వ డివిజన్ తెరాస అభ్యర్థి విజయారెడ్డి ప్రకటించారు. తన గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఆమె అన్నారు.
నా విజయం ప్రజలకు అంకితమిస్తున్నా : విజయారెడ్డి
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తన డివిజన్ను మరింత అభివృద్ధి చేయడానికి తనవంతు ప్రయత్నిస్తానని ఆమె తెలిపారు. ఖైరతాబాద్ డివిజన్ అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటు పడతానని విజయారెడ్డి పేర్కొన్నారు.