నాణ్యత, భద్రత విషయంలో మైహోం గ్రూపు ఎప్పడూ రాజీపడదని గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్లు స్పష్టం చేశారు. మైహోం గ్రూపు సంస్థ 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్లు శ్యామ్‌రావు, రామురావు, రజితారావు ఈ మూడున్నర దశాబ్దాలుగా తమ సంస్థ నిర్మాణ రంగంలో సాధించిన అభివృద్ధిని వివరించారు. ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరుకాలేకపోయారని వివరించారు.
నాణ్యత, భద్రత విషయంలో రాజీపడేదేలేదు: మైహోంగ్రూపు
నాణ్యత, భద్రత విషయంలో మై హోం గ్రూపు ఎప్పడూ రాజీపడదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు జూపల్లి శ్యామ్‌రావు, జూపల్లి రామురావు తెలిపారు. సిమెంటు, నిర్మాణరంగం, మీడియా తదితర మైహోం గ్రూపు సంస్థల వార్షిక టర్నోవర్ ఆరువేల కోట్లని వివరించారు.
ఇప్పటి వరకు 27 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణ నిర్మాణం పూర్తయ్యి కస్టమర్లకు పంపిణీ చేశామని... ఈ ఏడాది చివరినాటికి మరో 8 మిలియన్‌ల చదరపు అడుగులు విస్తీర్ణం నిర్మాణం పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. సిమెంటు, నిర్మాణరంగం, మీడియా తదితర మైహోం గ్రూపు సంస్థల వార్షిక టర్నోవర్ ఆరువేల కోట్లని వివరించారు. రాబోవు అయిదేళ్లలో తెల్లాపూర్‌లో 400 ఎకరాల్లో నివాస గృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోకాపేట్ ప్రాంతంలో వాణిజ్య స్పేష్ నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు.
ఇదీ చూడండి:ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్