తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... నా కల నెరవేరింది: కోనేరు హంపి - కోనేరు హంపి వార్తలు

చదరంగ క్రీడలో పదేళ్ల నుంచే రికార్డులు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కోనేరు హంపి. ఇటీవల రష్యాలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ మహిళా విభాగంలో విజేతగా నిలిచి ప్రపంచ ఛాంపియన్​గా అవతరించారు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి తన ఎత్తులతో ప్రత్యర్థిని మట్టి కరిపించారు. టైటిల్ విజేతగా బంగారు పతకం సొంతం చేసుకుని ఏపీ విజయవాడ చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది.

రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... నా కల నెరవేరింది: కోనేరు హంపి
రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... నా కల నెరవేరింది: కోనేరు హంపి

By

Published : Jan 1, 2020, 7:21 PM IST

రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... నా కల నెరవేరింది: కోనేరు హంపి

ప్రపంచ ఛాంపియన్​గా నిలవాలన్న తన కల త్వరగా నెరవేరిందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి తెలిపారు. ర్యాపిడ్ చెస్ మహిళల విభాగంలో ప్రపంచ విజేతగా నిలవడం సంతోషంగా ఉందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. రష్యాలో శనివారం జరిగిన మహిళల ర్యాపిడ్ చెస్ టోర్నీలో స్వర్ణం గెలిచిన హంపి ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ చేరుకున్నారు. ఆమెకు గన్నవరం విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటీవీ భారత్​తో ఆమె ముచ్చటించారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా పతకం సాధించడం విశేషమని హంపి చెప్పారు. పాప పుట్టిన తర్వాత రెండేళ్లు ఆటకు దూరంగా ఉన్నా... కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే మళ్లీ ఈ స్థాయికి చేరుకోగలిగానని హంపి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details