తెలంగాణ

telangana

ETV Bharat / state

నా పిల్లి పోయింది... వెతికిపెట్టండి

నాపిల్లి పోయింది. కేసు నమోదు చేసుకోని వెతికిపెట్టండని ఓ మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఇందుకు కారకులైన ఇద్దరు వ్యక్తులను విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

నా పిల్లి పోయింది

By

Published : Jul 26, 2019, 10:49 PM IST


హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​లో విచిత్రమైన కేసు నమోదైంది. తిరుమలగిరికి చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లుల్లో ఒకటి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా పిల్లి కనిపించడం లేదని.. జీవహింస కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. మహిళ ఫిర్యాదుతో ఒకింత ఆశ్చర్యపోయిన పోలీసులు పూర్తి వివరాలు ఆరా తీశారు.

గోడదూకి పారిపోయిన పిల్లి..

తిరుమలగిరికి చెందిన రాజేశ్వరి తన నివాసంలో రకరకాల పెంపుడు జంతువులు, పక్షులను పెంచుతోంది. శ్రీనగర్ కాలనీకి చెందిన వరప్రసాద్, సిద్ధార్థ అనే ఇద్దరు సామాజిక మాద్యమాల్లో ఆ విషయం తెలుసుకొని రాజేశ్వరి నుంచి రెండు మేలు జాతి పిల్లులను దత్తత తీసుకున్నారు. వాటిలో ఒకటి ఇంటికి తీసుకెళ్లగానే గోడ దూకి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యజమానురాలు... పిల్లి పారిపోవడానికి కారణమైన వరప్రసాద్, సిద్ధార్థలపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. సదరు మహిళ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు పిల్లిని వెతికిపెట్టేందుకు అవసరమైన సహాయం చేస్తామని చెప్పడం గమనార్హం.

నా పిల్లి పోయింది

ఇవీ చూడండి: భాజపా, ఎంఐఎంకు కేసీఆర్ సమన్వయకర్త: రేవంత్

ABOUT THE AUTHOR

...view details