ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ఎర్రోనిపల్లి పంచాయతీ మేకేనాయక్‌తండాకు చెందిన భార్యాభర్తల పంచాయితీకి మండల వైకాపా నాయకుడు ఒకరు మధ్యవర్తిగా ఉన్నాడు. గురువారం పంచాయితీ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి రావాలనీ.. తాను అక్కడే ఉన్నానని ఆ నాయకుడు ఇరువర్గాలకు సూచించాడు. ఆపై కార్యాలయంలోని ఓ గదిలో పంచాయితీ చేస్తుండగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కార్యాలయం కొద్దిసేపు రణరంగాన్ని తలపించింది.
భార్యాభర్తల పంచాయితీ.. రణరంగంలా ఎంపీడీవో కార్యాలయం - అనంతపురం జిల్లా సీకేపల్లి ఎంపీడీవో కార్యాలయం వార్తలు
భార్యాభర్తల పంచాయితీకి ఎంపీడీవో కార్యాలయాన్ని వైకాపా నాయకుడు వేదికగా మార్చగా... వివాదం చినికిచినికి ఇరువర్గాల పరస్పర దాడులకు దారి తీసింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
కార్యాలయానికి వచ్చిన సందర్శకులకు ఏం జరుగుతోందో అర్థంకాక... ముష్టిఘాతాలు కురిపించుకుంటున్న వారిని చూసి బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న నాయకులు ఇరువర్గాల వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే భార్యాభర్తల పంచాయితీకి ఎంపీడీవో కార్యాలయాన్ని వైకాపా నాయకుడు వేదికగా మార్చడం మీద.. కరోనా జోరు మీదున్న వేళ పదుల సంఖ్యలో ఒకే చోటచేరి పంచాయితీలు చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈవిషయమై ఎంపీడీవో సోనిబాయి వివరణ కోరగా.. ఘటన జరిగినప్పుడు తాను కార్యాలయంలో లేననీ.. ఏం జరిగిందో తెలుసుకుంటానని చెప్పారు.
ఇదీ చదవండి:ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు
TAGGED:
MPDO office in anantapur