తెలంగాణ

telangana

ETV Bharat / state

'మటన్​ ధరను పెంచండి... లేకపోతే మేం నష్టపోతాం' - mutton shops

మాంసం ధరల విషయంలో జీహెచ్​ఎంసీ అధికారులు పునరాలోచించాలని మటన్​షాపు యాజమాన్యం కోరింది. లేకపోతే తాము నష్టపోతామని వెల్లడించింది.

mutton-shop-owners-have-asked-ghmc-officials-to-increase-meat-prices-in-hyderabad
'మటన్​ ధరను పెంచండి... లేకపోతే మేం నష్టపోతాం'

By

Published : May 19, 2020, 11:18 AM IST

మాంసం ధరల విషయంలో జీహెచ్​ఎంసీ అధికారులు పునరాలోచించాలని హైదరాబాద్​ పంజాగుట్ట మటన్​షాపు యాజమాన్యం కోరింది. జీహెచ్​ఎంసీ నిర్ణయించిన ప్రకారంగా నాణ్యమైన మాంసాన్ని కిలోకు 700రూపాయలకు విక్రయించడం ద్వారా తాము నష్టాలకు గురవుతున్నామని షాపు యాజమాని వాపోయారు.

హోల్​సెల్​ మార్కెట్​ నుంచి తాము కిలో మాంసాన్ని 675 రూపాయాలకు కొనుగోలు చేసి.. 700 రూపాయలకే విక్రయించడం ద్వారా తామంతా నష్టపోయి అప్పులపాలవుతున్నామన్నారు. పంజాగుట్ట మటన్​షాపు హైక్వాలిటీ మటన్​ను విక్రయించడంతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.

హోల్​సేల్​ మార్కెట్​లో కేజీకి 675 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రవాణా, నిర్వహణ, అద్దె, బిల్లులు, విద్యుత్​, కార్మికుల చెల్లింపు, నీరు, పారిశుద్ధ్య ఛార్జీలు వంటి అదనపు ఛార్జీలు అవుతాయన్నారు.ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మటన్​ ధరను పెంచాల్సిందిగా కోరారు.

'మటన్​ ధరను పెంచండి... లేకపోతే మేం నష్టపోతాం'

ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!

For All Latest Updates

TAGGED:

mutton shops

ABOUT THE AUTHOR

...view details