నూతన సంవత్సరం వచ్చేసింది.2020లోకి అడుగుపెట్టాం.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే సంవత్సరం మన జీవితాలను తలకిందులు చేసే పరిస్థితి కూడా రావచ్చు. అదేంటంటే... చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై తేదీ రాసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొంప మునిగే ప్రమాదం ఉంది.
ఇది పాటించకపోతే కొంప కొల్లేరే..!
ఉదాహరణకు మనం 2020 ఫిబ్రవరి 15వ తేదీ పేరుతో చెక్ ఇవ్వాలనుకుంటే... 15-02-20 అని రాసి ఇస్తాం. సరిగ్గా ఇక్కడే మనకు ఓ చిక్కు వచ్చి పడనుంది. మీరు సంవత్సరం దగ్గర కేవలం 20 అని రాసి వదిలేస్తే 20 సంఖ్య తరువాత ఏ నంబరైనా రాసే అవకాశం ఉంటుంది. అదే 20 తర్వాత 19 అని రాస్తే 2019 అవుతుంది. 17 అని రాస్తే 2017 అవుతుంది. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని టోకరా పెట్టే గ్రూపులెన్నో ఇప్పటికే కాచుకోని ఉంటాయి. ఇలా డాక్యుమెంట్లు, చెక్కులపైన సులభంగా తేదీలు మార్చిపడేస్తారు. అందుకే ముఖ్యమైన వాటిపై తేదీలు రాసే విషయంలో అలర్ట్గా ఉండాల్సిందే.