కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులు, కర్షకులు, చిన్నవ్యాపారులు పోరాడే సమయం ఆసన్నమైందని జాతీయ రైతు సంఘం నాయకుడు రాకేశ్‌సింగ్ టికాయత్ అన్నారు. ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ సమితి చేపట్టనున్న బహిరంగ సభకు సంఘీభావం తెలిపేందుకు సంఘం నేతలు విశాఖ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి: టికాయత్ - టికాయత్ కామెంట్స్ న్యూస్
ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ సమితి చేపట్టనున్న బహిరంగ సభకు సంఘీభావం తెలిపేందుకు జాతీయ రైతు సంఘం నేతలు విశాఖ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై..కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు పోరాడే సమయం ఆసన్నమైందని సంఘం నాయకుడు రాకేశ్‌సింగ్ టికాయత్ అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
ఓ పక్క కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాడుతుండగా.. భారీ పరిశ్రమల్ని ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణమన్నారు రాకేశ్‌సింగ్. అంతా కలిసి పోరాడి.. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి