తెలంగాణ

telangana

ETV Bharat / state

రంజాన్​ మాసం ప్రారంభం.. మక్కా మసీద్​లో ప్రత్యేక ప్రార్థనలు - makkah masjid hyderabad news

ఇవాళ్టితో రంజాన్​ మాసం ప్రారంభమైంది. ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు పర్వదినానికి స్వాగతం పలికారు. కొవిడ్​ నిబంధనలు పాటించి ప్రార్థనలు చేసుకోవాలని.. ముస్లిం మతపెద్దలు, పోలీసులు సూచించారు.

ramjan
రంజాన్​ మాసం ప్రారంభం

By

Published : Apr 14, 2021, 6:39 AM IST

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఇవాళ్టితో ప్రారంభమైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్​ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిం సోదరులు పర్వదినానికి స్వాగతం పలికారు.

నమాజ్​కి వెళ్తున్న ముస్లిం సోదరులకు చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు మాస్కులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నమాజ్ చేసుకోవాలని సూచించారు. మక్కా మసీద్​లోనూ భౌతిక దూరం, సానిటైజేషన్ వంటి ఏర్పాట్లు చేశామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోదరులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

ఇవీచూడండి:రంజాన్ మాసం ప్రారంభం..సీఎం శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details