తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబం ముఖం చాటేసింది.. ముస్లిం యువత పాడె మోసింది! - ప్రకాశంలో మృతదేహానికి ముస్లిం యువకుల అంత్యక్రియలు న్యూస్

మానవత్వం వెల్లివిరిసింది... కరోనా మహమ్మారితో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాలేదు. పాడె మోసేందుకు మేమున్నామంటూ... ముస్లిం యువకులు ముందుకొచ్చి అంతిమ కార్యక్రమం నిర్వహించారు.

కరోనాతో వ్యక్తి మృతి... పాడే మోసిన ముస్లిం యువకులు
కరోనాతో వ్యక్తి మృతి... పాడే మోసిన ముస్లిం యువకులు

By

Published : Aug 11, 2020, 8:19 PM IST

ఏపీ ప్రకాశం జిల్లా మార్టూరు పట్టణం గన్నవరం రోడ్డులో ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కరోనా సమయం కావటంతో ఎవరూ పట్టించుకోలేదు. కడసారి చూసేందుకు కూడా బంధువులు రాలేదు. ఆ సమయంలో మజ్లిస్ పార్టీ యువకులు మీకు అండగా మేమున్నామంటూ ముందుకొచ్చారు.

కుల మతాలకు అతీతంగా దహస సంస్కారాలు నిర్వహించారు. ఆ నలుగురు చేసిన ఉపకారానికి ముస్లిం యువకులకు మృతుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. మజ్లిస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నేతలు సనాఉల్లా బాషా, మహహ్మద్ గని, సాద్ భాయ్, ముక్తుమ్ బాషా, జాఫర్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details