తెలంగాణ

telangana

ETV Bharat / state

హుస్సేన్‌సాగర్‌ వద్ద మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షో.. ఎప్పటినుంచంటే..! - Statues on Tankbund

Musical fountain at Hussain Sagar: హైదరాబాద్‌ నగరం అంటేనే ముందుగా గుర్తుకు వచ్చే వాటిలో హుస్సేన్‌ సాగర్‌ ఒకటి.. చాలా మంది పర్యాటకులు సాగర్‌ చుట్టూ తిరిగి అలా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్రముఖుల విగ్రహాలు చూసుకుంటూ వెళ్లాలి అనుకుంటారు. మరికొందరు హుస్సేన్‌సాగర్‌లో బోట్‌లో షికారు చేస్తూ బుద్ధుని విగ్రహం దగ్గరకు వెళ్లాలి అనుకుంటారు. పర్యటకులను మరింత ఆకార్షించేందుకు త్వరలోనే సాగర్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షోను అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Laser show at Hussainsagar
Laser show at Hussainsagar

By

Published : Jan 18, 2023, 2:43 PM IST

Musical fountain at Hussain Sagar: నగరంలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హుస్సేన్‌సాగర్‌ వద్ద మరిన్ని సొబగులు అద్దనున్నారు. ఎన్టీఆర్‌ మార్గ్‌ సమీపంలో త్వరలోనే సాగర్‌ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌ షో అందుబాటులోకి రానున్నాయి. ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే నెలలోనే కొత్త సచివాలయం ప్రారంభించనున్నారు. అదే నెలలో అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్‌ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే ఈ మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ అందుబాటులోకి తేనున్నారు. వెరసి ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డుకు కొత్త కళ రానుంది.

ఇవీ విశేషాలు:

  • గతంలో బహిరంగ స్థలంలో ఇలాంటి షోలు నిర్వహించేవారు. తొలిసారి నీటిలోనే మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌, లేజర్‌షో ఏర్పాటు పర్యాటకులు, సందర్శకులకు కొత్త అనుభూతి ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ రూ.17.02 కోట్ల వరకు వెచ్చిస్తోంది.
  • కొత్త సచివాలయం, అంబేడ్కర్‌ భారీ విగ్రహం, అమరవీరుల స్థూపం అన్ని ఒకేచోట రానుండటంతో ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారనుంది.
  • లేజర్‌ షోలో హైదరాబాద్‌ చరిత్ర, తెలంగాణ చరిత్ర.. నాటి ఘట్టాలు పొందుపర్చనున్నారు. ఈ షోకు లుంబినీ పార్కులో ప్రత్యేక టిక్కెట్‌ వసూలుచేసేవారు. ఇకనుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిల్చుని ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు.
  • రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు 20 నిమిషాల వంతున మూడు షోలు ఉంటాయి. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో నాలుగు షోలు ఏర్పాటుచేస్తారు.
  • ఫౌంటెయిన్‌లో 180 మీటర్ల వెడల్పున 700 నాజల్స్‌తో 3-30 మీటర్ల ఎత్తు వరకు జలాలు పైకి ఎగజిమ్ముతూ కనువిందు చేయనున్నాయి. సాగర్‌లో పడవపై తిరుగుతూ కూడా ఈ షో చూసే అవకాశం కల్పించనున్నారు. దీంతో ఇక సాగర్‌ వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details