ఇండియన్ ఐడల్(Indian Idol) గాయకులు భాగ్యనగర సంగీత ప్రియులను తమ గాన మాధుర్యంతో ఉర్రూతలూగించనున్నారు. రివైవ్ కన్సర్ట్ సిరీస్ పేరుతో ఎలెవన్ పాయింట్ టూ, మెటాలాయిడ్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక సంగీత కచేరీ నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ప్రతివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో(Prasad Digital Film Lab) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ పోటీదారులు పాల్గొన్నారు. వారిలో ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్(pawandeep rajan), మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్(Arunita kanjilal), రెండో రన్నరప్ శైలీ(sayli kamble), మూడో రన్నరప్ మొహమ్మద్ డానిష్‌తో(Mohd. Danish) పాటు రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ(shanmukha priya) ఉన్నారు.